రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి రైతులకు లబ్ధి చేకూర్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్‌కు రూ.35 వేల కోట్లు కేటాయించేందుకు ఆమోదముద్ర వేసింది.
అలాగే రబీ సీజన్‌కు సంబంధించి ఎరువుల సబ్సిడీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ - యురియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రబీ సీజన్ తర్వలో ప్రారంభమవుతున్న వేళ 2025- 26 రబీ మార్కెటింగ్ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ)ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఎంఎస్‌పీ పెరిగిన పంటల వివరాలు
క్వింటాల్ ఆవాలుకు అత్యధికంగా ఎంఎస్‌పీ రూ.300 పెంచడంతో గతంలో రూ.5,650గా ఉన్న ఆవాలు కనీస మద్ధతు ధర ఇప్పుడు రూ.5,950కి చేరింది.
క్వింటాల్ పెసరకు ఎంఎస్‌పీ రూ.275 పెంచడంతో గతంలో రూ.6,425గా ఉన్న పెసర కనీస మద్ధతు ధర ఇప్పుడు రూ.6,700కి చేరింది.
క్వింటాల్ శనగలకు ఎంఎస్‌పీ రూ.210 పెంచడంతో గతంలో రూ.5,440గా ఉన్న శనగల కనీస మద్ధతు ధర ఇప్పుడు రూ.5,650కి చేరింది.
క్వింటాల్ గోధుమలకు ఎంఎస్‌పీ రూ.150 పెంచడంతో గతంలో రూ.2,275గా ఉన్న గోధుమల కనీస మద్ధతు ధర ఇప్పుడు రూ.2,425కి చేరింది.
క్వింటాల్ పొద్దు తిరుగుడుకు ఎంఎస్‌పీ రూ.140 పెంచడంతో గతంలో రూ.5,800గా ఉన్న కనీస మద్ధతు ధర ఇప్పుడు రూ.5,940కి చేరింది.
క్వింటాల్ బార్లీకి ఎంఎస్‌పీ రూ.130 పెంచడంతో గతంలో రూ.1850 గా ఉన్న కనీస మద్ధతు ధర ఇప్పుడు రూ.1980కి చేరింది.