2026లో జరగనున్న సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్‌ఈ (CBSE) స్పష్టం చేసింది. పది, 12వ తరగతి పరీక్షలకు తుది డేట్ షీట్‌లు విడుదల చేసింది బోర్డు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ కంట్రోలర్ (ఎగ్జామ్స్) భరద్వాజ్ వెల్లడించారు. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత సమయం ఉండేలా చూడటంతో పాటు 12వ తరగతి విద్యార్థులకు వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని డేట్ షీట్‌లను సిద్ధం చేసినట్లు తెలిపారు.
పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు; 12వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజూ పరీక్షలు ఉదయం 10.30గంటలకు ప్రారంభమవ్వనున్నాయి. రెండు సబ్జెక్టుల మధ్య విద్యార్థులకు తగినంత సమయం ఉండేలా చూడటంతో పాటు 12వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్‌లను సిద్ధం చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.