బాలాసోర్ ప్రమాదంపై మొదలైన సీబీఐ విచారణ

బాలాసోర్ రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగా సీబీఐ విచారణ మొదలైంది. బ‌హ‌న‌గా బ‌జార్ స్టేష‌న్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌పై

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Jun 2023 1:30 PM IST
CBI investigation , Balasore train accident, Odisha, National news

బాలాసోర్ ప్రమాదంపై మొదలైన సీబీఐ విచారణ 

బాలాసోర్ రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగా సీబీఐ విచారణ మొదలైంది. బ‌హ‌న‌గా బ‌జార్ స్టేష‌న్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో ఉద‌యం సీబీఐ అధికారులు ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ సైట్‌కు చేరుకున్న సీబీఐ ఆఫీస‌ర్లు ఇంక్వైరీ మొద‌లుపెట్టిన‌ట్లు ఖుర్దా డీఆర్ఎం రింకేశ్ రాయ్ తెలిపారు. ఖుర్దా డివిజిన‌ల్ రైల్వే మేనేజ‌ర్ మాట్లాడుతూ ఈ ప్ర‌మాదం వెనుక ఏదో కుట్ర ఉన్న‌ట్లు తెలిపారు. సిగ్న‌ల్‌ను ట్యాంప‌ర్ చేసి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. మెయిన్ లైన్‌లో గ్రీన్ సిగ్న‌ల్ ఉంద‌ని, అన్ని స‌క్ర‌మంగా ఉంటేనే గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తుంద‌ని, ఒక‌వేళ ఏదైనా స‌మస్య ఉంటే గ్రీన్ సిగ్న‌ల్ రాదని తెలిపారు. త‌మ వ‌ద్ద ఉన్న డేటా లాగ‌ర్ ప్ర‌కారం గ్రీన్ సిగ్న‌ల్ బ‌ట‌న్ నొక్కిన‌ట్లే ఉంద‌ని తెలిపారు. ఎవ‌రైనా ఫిజిక‌ల్‌గా ట్యాంప‌ర్ చేస్తే త‌ప్ప ఆ సిగ్న‌ల్ మార‌ద‌న్నారు.

ఈ యాక్సిడెంట్ పై రైల్వే బోర్డు కొద్దిరోజుల కిందట కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తును సీబీఐకి రైల్వే బోర్డు సిఫార్సు చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానింగ్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ప్రమాదం సంభవించిందని, రైల్వే భద్రతా విభాగ కమిషనర్ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని అన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను గుర్తించినట్టుగా తెలిపారు. సరైన విచారణ తర్వాత ఎవరు చేసారో, ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు.

Next Story