లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు షాక్‌.. 17 చోట్ల సీబీఐ దాడులు

CBI Files Fresh Corruption Case Against RJD Chief Lalu Yadav Raids Underway At Several Places.రాష్ట్రీయ జనతాదళ్ అధినేత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2022 6:23 AM GMT
లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు షాక్‌.. 17 చోట్ల సీబీఐ దాడులు

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు మ‌రో షాక్ త‌గిలింది. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, ఆయ‌న భార్య‌ ర‌బ్రీ దేవి, కుమార్తె మీసా భారతి నివాసాల‌తో పాటు పట్నా, గోపాల్‌గంజ్‌, ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో మొత్తం 17 చోట్ల శుక్రవారం తెల్లవారుజాము నుంచి సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్(సీబీఐ) సోదాలు నిర్వ‌హిస్తోంది.

లాలూ ప్రసాద్‌ రైల్వే శాఖ మంత్రి(2004-2009)గా ఉన్నసమయంలో రైల్వే నియామ‌కాల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ, అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల‌డంతో సీబీఐ దాడులు నిర్వ‌హిస్తోంద‌ని పేర్కొంటున్నారు.

దీనిపై ఆర్జేడీ పార్టీ నాయ‌కులు మాట్లాడుతూ.. ప‍్రజల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌లకు పెరుగుతున్న పాపులారీ కారణంగానే ప్రభుత్వం కక్షగట్టి వారిపై ఇలా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా.. రూ. 139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 73 ఏళ్ల లాలూ గత నెలలో జైలు నుంచి బయటకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Next Story