మదురై విమానాశ్రయంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ కార్యకర్తపై దాడి చేసిన ఆరోపణలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఇ పళనిస్వామిపై పోలీసు కేసు నమోదైంది. ఎఐఎడిఎంకె తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి శివగంగలో జరగనున్న పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు చెన్నై నుంచి మధురై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆయన విమానాశ్రయం నుండి బస్సులో వెళుతుండగా.. రాజేశ్వరన్ అనే వ్యక్తి పళనిస్వామిని 'ద్రోహి' అని పిలిచాడు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు పళనిస్వామి ద్రోహం చేశాడని 42 ఏళ్ల రాజేశ్వరన్ ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో లైవ్ రికార్డ్ చేయడం ప్రారంభించాడు. పళనిస్వామి వ్యక్తిగత భద్రతా అధికారి రాజేశ్వరన్ చేతిలో నుండి ఫోన్‌ను లాక్కొని.. దానిని పోలీసు అధికారులకు అప్పగించాడు. అయితే.. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఏఐఏడీఎంకే కార్యకర్తలు ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరన్‌ను చుట్టుముట్టి దాడి చేసినట్లు సమాచారం.
ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తొలుత అవనియాపురం పోలీసులు తెలిపారు. అనంతరం.. పళనిస్వామి, ఆయన పీఎస్‌వో కృష్ణన్, శివగంగై ఎమ్మెల్యే సెంథిల్‌నాథన్, మాజీ మంత్రి మణికందన్‌లపై రాజేశ్వరన్ ఫిర్యాదు చేశాడు. రాజేశ్వరన్‌పై కూడా అవనియాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.