సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. యూపీలో బుల్డోజర్ల చర్యపై

Can't stop demolition but it must be according to law says SC on UP govt's bulldozer action.ఉత్తరప్రదేశ్‌లో అక్రమ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 4:02 PM IST
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. యూపీలో బుల్డోజర్ల చర్యపై

ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని కోర్టు స్పష్టం చేసింది. కట్టడాల కూల్చివేత అంతా చట్టం ప్రకారం జరగాలని పేర్కొంది. బుల్డోజర్ల చర్యపై మూడు రోజుల్లో అఫిడవిట్‌ను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింసాకాండ అల్లర్ల కేసుల్లో నిందితుల ఇళ్ళను కూల్చేయడాన్ని ఆపాలంటూ జమియత్ ఉలమా-ఇ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని యోగీ సర్కార్‌ ఇలా చేస్తోందని పిటిషనర్ ఆరోపణలు చేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు ప్రారంభించారని ఆరోపించారు.

ఎవరినీ తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కూల్చివేత సమయంలో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని.. బుల్డోజర్ల చర్యకు ముందు నోటీసులు ఇచ్చామని తెలిపింది. ప్రయాగ్ రాజ్, కాన్పూర్‌లో కూల్చివేతలకు ముందు నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చినట్టు యూపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పిటిషనర్లకు భద్రత కల్పించాల్సిన భాద్యత తమపై ఉందని.. చట్టం ప్రకారం మాత్రమే కూల్చివేతలు జరగాలని, ప్రతికారాత్మకంగా ఉండకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.

Next Story