ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) కేసులో నలుగురు దోషులు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీ ఖాన్ పిటీషన్ వేశారు. తమను శిక్షించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్లు దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా, పిటిషనర్లు గతంలో తమకు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదని వాదించారు. మళ్ళీ బెయిల్ మంజూరు చేస్తే అన్ని చట్టపరమైన షరతులను పాటిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. నాంపల్లిలోని CBI కోర్టు మే 6న OMC కేసులో తీర్పు వెలువరించింది, నలుగురినీ దోషులుగా తేల్చింది. ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.