ఐదారు నెలల్లో అందుబాటులోకి క్యాన్సర్ వ్యాక్సిన్ : కేంద్ర మంత్రి
క్యాన్సర్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది.
By Medi Samrat
క్యాన్సర్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఐదు నుంచి ఆరు నెలల్లో క్యాన్సర్‌తో పోరాడే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ మంగళవారం తెలిపారు. తొమ్మిదేళ్ల నుంచి 16 ఏళ్ల లోపు వారు కూడా ఈ వ్యాక్సిన్‌కు తీసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఛత్రపతి సంభాజినాగలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై పరిశోధనలు దాదాపు పూర్తయ్యాయని, ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోయిందని, సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించి వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కూడా ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసిందని తెలిపారు. మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధన దాదాపు పూర్తయిందని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది ఐదు నుండి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుంది.. తొమ్మిది నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలు కూడా టీకాలకు అర్హులు అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఏయే క్యాన్సర్‌లపై పనిచేస్తుందని అడగగా.. రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్‌ను పరిష్కరిస్తుందని జాదవ్ చెప్పారు.
ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాలను ఆయుష్ విభాగాలుగా మార్చడంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు జాదవ్ బదులిస్తూ.. ఆసుపత్రుల్లో ఆయుష్ విభాగాలు ఉన్నాయని.. ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. దేశంలో ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు 12,500 ఉన్నాయని, వాటిని ప్రభుత్వం విస్తరిస్తున్నదని చెప్పారు.