శర్మిష్ట పనోలికి బెయిల్

ఇస్లాంపై అవమానకరమైన వ్యాఖ్యలకు అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు జూన్ 5 గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది

By Medi Samrat
Published on : 5 Jun 2025 9:15 PM IST

శర్మిష్ట పనోలికి బెయిల్

ఇస్లాంపై అవమానకరమైన వ్యాఖ్యలకు అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు జూన్ 5 గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 22 ఏళ్ల శర్మిష్ట పనోలి రూ. 10,000 బెయిల్ బాండ్ చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

జూన్ 3న కోర్టు శర్మిష్ట బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. వాక్ స్వేచ్ఛను ఇతరులను బాధపెట్టడానికి ఉపయోగించకూడదని పేర్కొంది. భారత దేశం వైవిధ్యమైనది, వివిధ కులాలు, మతాలకు చెందిన వ్యక్తులతో నిండి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో మనం జాగ్రత్తగా ఉండాలని జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ అన్నారు.

లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని కోల్‌కతా పోలీసులు గురుగ్రామ్ నుండి అరెస్టు చేశారు. కోల్‌కతా కోర్టు జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సింబయోసిస్ కాలేజీలో లా చదువుతున్న శర్మిష్ట, మే 14న తన X ఖాతాలో ఇస్లాంను అవమానించి, కించపరిచింది. ఆ తర్వాత తన ట్వీట్ ను డిలీట్ చేసింది.

Next Story