ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయనున్న ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. ఫిబ్రవరి 1న (ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ సమావేశాలను రెండు భాగాలుగా విభజించారు. తొలి దశ నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుంది. దీని తర్వాత సెషన్ వాయిదా పడి.. రెండవ దశ మార్చి 9 నుండి ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. ఈ విరామంలో పార్లమెంటరీ కమిటీలు బడ్జెట్ ప్రతిపాదనలను క్షుణ్ణంగా సమీక్షిస్తాయి.
ఈసారి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన అంటే ఆదివారం సమర్పించనున్నారు. పార్లమెంటు చరిత్రలో ఇదో అరుదైన సందర్భం. ఈ రోజును 'బడ్జెట్ డే'గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నిర్మలా సీతారామన్‌కి ఇది వరుసగా తొమ్మిదవ బడ్జెట్. కాగా, ఈ బడ్జెట్‌పై అందరికీ ఎన్నో అంచనాలున్నాయి.
ఇదిలావుంటే.. బడ్జెట్‌కు ముందు నార్త్ బ్లాక్‌లో సాంప్రదాయ హల్వా వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ వేడుక బడ్జెట్ పత్రాల రహస్య ప్రక్రియ యొక్క అధికారిక ప్రారంభాన్ని సూచిస్తుంది.