పెళ్లి కుమారై మృత‌దేహన్ని ప‌క్క‌నే ఉంచి ఆమె చెల్లితో..

Bride dies due to heart attack.పెళ్లికి అంతా సిద్ద‌మైంది. మ‌రో ఐదు నిమిషాల్లో మెడ‌లో తాళిబొట్టు ప‌డ‌నుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2021 6:22 AM GMT
పెళ్లి కుమారై మృత‌దేహన్ని ప‌క్క‌నే ఉంచి ఆమె చెల్లితో..

పెళ్లికి అంతా సిద్ద‌మైంది. మ‌రో ఐదు నిమిషాల్లో మెడ‌లో తాళిబొట్టు ప‌డ‌నుంది. చుట్టూ కోలాహాల వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే.. ఉన్న‌ట్లుండి పెళ్లి కుమారై పెళ్లి పీఠ‌ల‌పై కుప్ప‌కూలిపోయింది. డాక్ట‌ర్లు ప‌రీక్షించి ఆమె చ‌నిపోయింద‌ని చెప్పారు. ఆమె మృత‌దేహాన్ని అక్క‌డే ఉంచి.. చ‌నిపోయిన పెళ్లికుమారై చెల్లితో వ‌రుడికి వివాహాం జ‌రిపించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో మంజేష్ అనే వ్య‌క్తితో సుర‌భి అనే యువ‌తి వివాహాన్ని పెద్ద‌లు నిశ్చ‌యించారు.

పెళ్లి కోసం అంగ‌రంగ వైభ‌వంగా ఏర్పాట్లు చేశారు. అంద‌రూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మ‌రో ఐదు నిమిషాల్లో మంజేష్.. సుర‌భి మెడ‌లో వేయ‌నున్నాడు. అయితే.. ఉన్న‌ట్లుండి సుర‌భి పెళ్లి పీట‌ల‌పైనే కుప్ప‌కూలింది. ఆందోళ‌న చెందిన అక్క‌డి వారు వెంట‌నే ద‌గ్గ‌రిలోని వైద్యుడిని అక్క‌డికి పిలిపించారు. అత‌డు ఆమెని ప‌రీక్షించి గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు చెప్పాడు. పెళ్లిని ఆప‌డం ఇష్టం లేని ఆ కుటుంబ స‌భ్యులు మృతురాలి చెల్లులు నిషాతో మంజేష్‌కు వివాహం జ‌రిపించారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై సురభి సోదరుడు మీడియాకి మాట్లాడుతూ.. ఆ ప‌రిస్థితిలో ఏం చేయాలో అర్ధం కాలేదు. నా పెద్ద చెల్లెలు సుర‌భి డెడ్ మృత‌దేహాన్ని పెళ్లి మండ‌పంలో ఉంచాం. ఇరుకుటుంబ స‌భ్యుల అంగీకారంతో నా చిన్న చెల్లెలు నిషాను మంజేష్ కి ఇచ్చి వివాహం జ‌రిపించాం. అనంత‌రం సుర‌భి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించామ‌ని తెలిపాడు.

Next Story
Share it