ఈతకొడితే చాలు.. మెదడులోకి ప్రవేశించే వైరస్..!

సోమవారం నాడు మరొకరు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన, ప్రాణాంతకమైన మెదడు సంబంధిత ఇన్ఫెక్షన్ కు గురై కేరళలో మరణించారు.

By Medi Samrat
Published on : 8 Sept 2025 7:04 PM IST

ఈతకొడితే చాలు.. మెదడులోకి ప్రవేశించే వైరస్..!

సోమవారం నాడు మరొకరు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన, ప్రాణాంతకమైన మెదడు సంబంధిత ఇన్ఫెక్షన్ కు గురై కేరళలో మరణించారు. ఆగస్టు నుండి రాష్ట్రంలో ఈ అరుదైన వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. జిల్లాలోని వాండూర్ కు చెందిన 54 ఏళ్ల మహిళ ఈ ఇన్ఫెక్షన్ కు తాజాగా గురయ్యింది. కోజికోడ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉందని ఆరోగ్య అధికారులు తెలిపారు. శనివారం నాడు వయనాడ్ లోని సుల్తాన్ బతేరీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి మరణించారు.

ఆగస్టులో రాష్ట్రంలో అమీబిక్ బ్రెయిన్ ఫీవర్ కారణంగా ముగ్గురు మరణించారు. ఈ వ్యాధి లక్షణాలతో కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీలో ఇంకా చాలా మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేరళ ఆరోగ్య శాఖ ఇటీవల అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ చికిత్స కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ప్రధానంగా ఈత కొట్టడం లేదా కలుషిత నీటిలో స్నానం చేయడం ద్వారా సంక్రమిస్తుంది. ఈ సంవత్సరం కేరళ అంతటా మొత్తం 42 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

Next Story