శక్తిమిల్స్ సామూహిక అత్యాచార కేసు.. నిందితులకు మరణ శిక్ష రద్దు చేసిన బాంబే హైకోర్టు
Bombay high court sets aside death sentences to shakti mills gang rape case convicts. బాంబే హైకోర్టు ముగ్గురు శక్తి మిల్స్ సామూహిక అత్యాచారం దోషులకు గతంలో విధించిన మరణశిక్షలను రద్దు చేసింది. ప్రజల నిరసన ఆధారంగా తీర్పును చెప్పలేమని పేర్కొంది.
By అంజి Published on 25 Nov 2021 8:09 AM GMTనవంబర్ 25, గురువారం నాడు బాంబే హైకోర్టు ముగ్గురు శక్తి మిల్స్ సామూహిక అత్యాచారం దోషులకు గతంలో విధించిన మరణశిక్షలను రద్దు చేసింది. ప్రజల నిరసన ఆధారంగా తీర్పును చెప్పలేమని పేర్కొంది. "శక్తి మిల్ సామూహిక అత్యాచారం కేసు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అత్యాచార బాధితురాలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బాధపడుతోంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. కానీ ప్రజల నిరసనను మాత్రమే పరిగణనలోకి తీసుకోలేమని" హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. మరణశిక్ష ఒక మినహాయింపు మాత్రమే. తీర్పు ప్రజల ఆగ్రహానికి దారితీయకూడదని హైకోర్టు తెలిపింది. నిందితులు జీవితాంతం కటకటాల వెనుక గడపవలసి ఉంటుంది. వారు పెరోల్‌కు అర్హులు కాదని, దోషులకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది.
శక్తి మిల్స్ గ్యాంగ్-రేప్ కేసు
2013లో 22 ఏళ్ల మహిళా ఫోటో జర్నలిస్ట్ ఒక వ్యక్తితో కలిసి ఫోటోషూట్ కోసం ముంబైలోని శక్తి మిల్స్‌కి వెళ్లింది. అక్కడ ఐదుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని కట్టేసి మహిళపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిపై విజయ్ జాదవ్, మహ్మద్ ఖాసిం బెంగాలి, మహ్మద్ సలీం అన్సారీ, సిరాజ్ రెహ్మీన్ ఖాన్, ఆకాష్‌లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితుల్లో ఆకాశ్ జాదవ్ అనే బాలనేరస్థుడు ఉన్నాడు. నేరం జరిగినప్పుడు అతను మైనర్‌గా ఉన్నందున, జువైనల్ హోమ్‌కు పంపారు. కొన్ని సంవత్సరాల తరువాత అతడు విడుదలయ్యాడు. కాగా సామూహిక అత్యాచారం, నేరపూరిత కుట్ర, ఉమ్మడి ఉద్దేశం, అసహజ సెక్స్, నేరపూరిత బెదిరింపు, తప్పుడు నిర్బంధం, దాడి, IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద సాక్ష్యాలను నాశనం చేసినందుకు ఐదుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది.
ఇదే గ్యాంగ్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 19 ఏళ్ల టెలీకాలర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 2013 జూలై-ఆగస్టులో జరిగిన రెండు సామూహిక అత్యాచారాలకు సంబంధించి ఇద్దరు మైనర్‌లతో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లో ముగ్గురు నిందితులు దోషులుగా తేలారు. ఆ తర్వాత మార్చి 2014లో సెషన్స్ కోర్టు 18 ఏళ్ల యువకుడితో సహా ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి మరణశిక్ష విధించింది. ఈ ముగ్గురు రెండు సామూహిక అత్యాచారం కేసుల్లో దాడికి పాల్పడ్డారు. ఏదైనా ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్ష అమలులోకి రావాలంటే హైకోర్టు తప్పనిసరిగా నిర్ధారించాలి. ఈ క్రమంలోనే నిందితులు కూడా తమ శిక్షకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకున్నారు.
ఫోటో జర్నలిస్ట్‌పై విజయ్ జాదవ్, మహమ్మద్ కాసిమ్ బెంగాలీ, మహమ్మద్ సలీం అన్సారీ, సిరాజ్ రెహ్మాన్ ఖాన్, నేరం జరిగిన సమయంలో మైనర్‌గా ఉన్న ఆకాష్ అనే ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక సంవత్సరం తర్వాత, మార్చి 2014లో, జాదవ్, బెంగాలీ మరియు అన్సారీలను ముంబై సెషన్స్ కోర్టు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354B (దాడి), 377 (అసహజ నేరం) మరియు 376D (గ్యాంగ్ రేప్) కింద దోషులుగా నిర్ధారించింది. ఖాన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, జువైనల్ జస్టిస్ బోర్డ్ దోషిగా నిర్ధారించిన తర్వాత ఆకాష్‌ను దిద్దుబాటు కేంద్రానికి పంపారు. ప్రాసిక్యూషన్ IPC యొక్క సెక్షన్ 376E (పునరావృత నేరస్థులు)ని అమలు చేసిన తర్వాత అప్పటి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి షాలినీ ఫన్సల్కర్ జోషి ఈ ముగ్గురికి మరణశిక్ష విధించారు.