వరవరరావుకు బెయిల్ ఇవ్వలేమన్నారు

Bombay High Court Rejects Varavara Rao Bail Petition. భీమా కోరేగావ్‌ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలతో అరెస్టై రెండేళ్లు

By Medi Samrat
Published on : 13 Nov 2020 4:28 PM IST

వరవరరావుకు బెయిల్ ఇవ్వలేమన్నారు

భీమా కోరేగావ్‌ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలతో అరెస్టై రెండేళ్లుగా నిర్బంధంలో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత రచయిత వరవరరావు బెయిల్‌ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యుల పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస‍్కరించింది. అయితే నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ముంబై హైకోర్టు ఆదేశించింది.

భీమా కోరేగావ్‌ కేసులో 80 ఏళ్ల వృద్ధుడైన వరవరరావు కీలక నిందితుడిగా ఎన్‌ఐఏ పేర్కొంది. జూన్, 2018లో అరెస్టు అయినప్పటి నుండి వరవరావు జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, అతను జైలులోనే చనిపోయే ప్రమాదం ఉన్నదని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు.

రిమాండ్‌ ఖైదీగా ఉన్న వరవరరావుకి నానావతి ఆసుపత్రికి చెందిన ప్రైవేట్‌ వైద్యుల బృందంచే వీడియో కన్సల్టేషన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్ళి నేరుగా వైద్య పరీక్షలు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వైద్య పరీక్షల నివేదికను నవంబర్‌ 16 లోపు కోర్టుకి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడి ఆరోగ్య పరిరక్షణకు నానావతి ఆసుపత్రి వైద్యుల పరీక్షలే ఉపయోగకరమని కోర్టు అభిప్రాయపడింది.


Next Story