న్యాయవాదికి మాస్క్‌ లేనందుకు వాదించేందుకు నిరాకరించిన జడ్జి

Bombay HC refuses to hear the plea after advocate removes facemask inside the courtroom. ఒక న్యాయవాది వాదించే కేసును విచారించేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది.

By Medi Samrat  Published on  1 March 2021 8:59 AM GMT
Bombay HC refuses to hear the plea after advocate removes facemask inside the courtroom.

ఒక న్యాయవాది వాదించే కేసును విచారించేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. అయితే అందుకు కారణం లేకపోలేదు. సదరు న్యాయవాది మాస్క్‌ ధరించకపోవడమే. నో మాస్క్‌, నో విచారణ అని కోర్టు తేల్చి చెప్పింది. ముంబై హైకోర్టుకు చెందిన సింగిల్‌ బెంచీ న్యాయమూర్తి పృథ్వీరాజ్‌ చవాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానంలో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవది తన వాదనలు వినిపించేందుకు మాస్క్‌ను తొలగించి వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు. దీనిని గమనించిన జస్టిస్‌ చవాన్‌ వెంటనే స్పందిస్తూ ఆ కేసును విచారించేందుకు నిరాకరించి మరో కొత్త తేదీని ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలో కోర్టులు ఆన్‌లైన్‌లోనే కేసులను విచారించాయి.

ఈ మధ్య కాలంలో కోర్టులు విచారణ చేపడుతున్నాయి. విచారణ సమయంలో కూడా కోర్టులు కరోనా నిబంధనలు పాటిస్తూనే విచారణ జరుపుతున్నాయి. అదే సమయంలో కరోనా నిబంధనలను అనుసరించాలని తీర్మానించారు. ఈ ఎస్‌ఓపీఎస్‌ ప్రకారం కోర్టులో న్యాయవాదులతో సహా ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించడం అనివార్యం చేశారు. జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ మాట్లాడుతూ.. కోర్టులో న్యాయ విచారణ జరిపేటప్పుడు ఆ కేసుకు సంబంధించిన వారు మాత్రమే కోర్టు హాలులో ఉండాలని, మిగతా న్యాయవాదులంతా పక్క రూమ్‌లో తమ వంతు వచ్చే వరరకు వేచి చూడాలని అన్నారు. విచారణ సమయంలో సబార్డినేట్లు వాదిస్తున్నప్పుడు న్యాయస్థానంలో ఉన్న సీనియర్‌ న్యాయమూర్తులు కూడా మాస్క్‌లు తప్పకుండా ధరించాల్సిందేనని ఆయన అన్నారు.


Next Story