రైల్వే స్టేషన్‌ను బాంబు పెట్టి పేల్చేద్దామ‌న్ని మాట్లాడుకుంటున్నారు.. అది విన్న ఆటోడ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అలీఘర్ రైల్వే స్టేషన్‌ను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు రావ‌డం అధికారులను భయాందోళనకు గురి చేసింది

By Kalasani Durgapraveen  Published on  8 Nov 2024 4:39 AM GMT
రైల్వే స్టేషన్‌ను బాంబు పెట్టి పేల్చేద్దామ‌న్ని మాట్లాడుకుంటున్నారు.. అది విన్న ఆటోడ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అలీఘర్ రైల్వే స్టేషన్‌ను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు రావ‌డం అధికారులను భయాందోళనకు గురి చేసింది. స్టేషన్‌లోని మొత్తం ఏడు ప్లాట్‌ఫారమ్‌లు, సర్క్యులేటింగ్ ఏరియా, పార్శిల్ ఆఫీస్‌తో సహా మొత్తం ప్రాంగణాన్ని తనిఖీ చేసినట్లు ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఆగిన రైళ్లలో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఏమీ దొరకలేదు. అయినా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

గురువారం రాత్రి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భామౌలా నుంచి రైల్వే స్టేషన్‌కు ఇద్దరు యువకులు ఈ-రిక్షా ఎక్కారు. దారిలో అలీఘర్ జంక్షన్‌లో బాంబు పేల్చాలని యువకులిద్దరూ తమలో తాము మాట్లాడుకుంటున్నారు. స్థలాన్ని చూసిన తర్వాత అక్క‌డ‌ బాంబును ఉంచుదాం.. అది శుక్రవారం పేలుతుంది అని మాట్లాడుకోవ‌డం డ్రైవ‌ర్ విన్నాడు. కాసేప‌టికి ఈ-రిక్షా డ్రైవర్ యువకులిద్దరితో స్టేషన్‌కు చేరుకున్నాడు. యువకులు దిగిన తర్వాత ఈ-రిక్షా డ్రైవర్ భామౌలా చేరుకున్నాడు. ఈ విషయాన్ని భామౌలా పోలీస్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ ఉస్మాన్‌కు తెలిపాడు. పోస్ట్ ఇన్‌ఛార్జ్ రాత్రి 11 గంటల సమయంలో ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ సింగ్‌కు సమాచారం అందించారు. దీని తరువాత, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ గుల్జార్ సింగ్ నేతృత్వంలో ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్, జిఆర్‌పి, పోలీస్ స్టేషన్ సివిల్ సిబ్బంది తనిఖీలు చేశారు.

Next Story