కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులను ఉటంకిస్తూ ANI నివేదించింది. బాంబు నిర్వీర్య స్క్వాడ్స్ ప్రస్తుతం టెర్మినల్స్‌ను తనిఖీ చేస్తున్నాయని ANI న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇటీవల దేశంలో పలు పాఠశాలలు, విమానాలు, కొన్నిసార్లు విమానాశ్రయాలకు బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తరువాత దేశంలో భద్రతా సిబ్బంది హై అలర్ట్ అయ్యింది. ఇటువంటి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది.