జమ్మూకాశ్మీర్‌లో నేడు ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌.. స‌భావేదిక‌కు 12 కి.మీ దూరంలో పేలుడు

Blast reported 12 km from PM Narendra Modi`s rally venue in Jammu.స్వతంత్ర ప్ర‌తిప‌త్తి హోదానిచ్చే 370 అధిక‌ర‌ణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2022 10:36 AM IST
జమ్మూకాశ్మీర్‌లో నేడు ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌.. స‌భావేదిక‌కు 12 కి.మీ దూరంలో పేలుడు

స్వతంత్ర ప్ర‌తిప‌త్తి హోదానిచ్చే 370 అధిక‌ర‌ణ ఉప‌సంహ‌ర‌ణ త‌రువాత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తొలిసారి నేడు(ఆదివారం) జ‌మ్మూ-క‌శ్మీర్ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూకాశ్మీర్ లోని మారు మూల గ్రామం నుంచి మోదీ యావత్ జాతికి సందేశం వినిపించనున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న బనిహాల్‌-కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటు, రూ.20వేల‌ కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు.

అయితే.. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు కొన్ని గంట‌ల ముందు స‌భావేదిక‌కు 12 కిలోమీట‌ర్ల దూరంలో పేలుడు సంభ‌వించింది. లాలియాన గ్రామంలో ఆదివారం తెల్ల‌వారుజామున 4.30గంట‌ల స‌మ‌యంలో ఓ పొలంలో పేలుడు చోటు చేసుకుంది. ప్ర‌ధాని బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నున్న సాంబా జిల్లాలోని ప‌ల్లీగ్రామానికి ఇది స‌మీపంలోనే ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. ఇది ఉగ్ర‌దాడి కాక‌పోవ‌చ్చున‌ని పోలీసులు బావిస్తున్నారు. బహుశా ఇది పిడుగుపాటు లేదా ఉల్క వల్ల ఏర్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై విచారణ కొన‌సాగుతోంది.

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్లు, ఉగ్రదాడులు కొనసాగుతున్న త‌రుణంలో ఆదివారం నాటి ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ చీఫ్ కుల్ దీప్ సింగ్ స్వయంగా పల్లీ గ్రామాంలో పర్యటించి సభా స్థలి వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Next Story