పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి

పంజాబ్ రాష్ట్రం అమృత్‌స‌ర్‌లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌పై మంగళవారం తెల్లవారుజామున 3:10 గంటలకు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పేలుడుకు పాల్పడ్డారు.

By Kalasani Durgapraveen  Published on  17 Dec 2024 5:21 AM GMT
పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి

పంజాబ్ రాష్ట్రం అమృత్‌స‌ర్‌లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌పై మంగళవారం తెల్లవారుజామున 3:10 గంటలకు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పేలుడుకు పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియాకు సన్నిహితుడైన జీవన్ ఫౌజీ ఈ దాడికి బాధ్యత వహించాడు. దీనికి సంబంధించి ఓ పోస్ట్ ఇంటర్నెట్ మీడియాలో వైరల్‌గా మారింది. పేలుడు జరిగిన వెంటనే పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న నివాస ప్రాంత ప్రజలు పేలుడుపై ఆరా తీస్తే.. పోలీసు సిబ్బంది ఏమీ చెప్పలేదు.

అయితే పేలుడు శబ్ధానికి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. ఉదయం 9:30 గంటలకు ఒక సైనిక బృందం కూడా విచారణ కోసం సంఘటనా స్థలానికి చేరుకుంది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లర్ తెలిపారు. పోలీస్ స్టేషన్ బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి.

Next Story