రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

By Kalasani Durgapraveen
Published on : 11 Nov 2024 12:35 PM

రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాహుల్ గాంధీ చేస్తున్న అసత్యాలను ఖండించాలని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సోమవారం బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. వచ్చే వారం జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ప్రచారంలో అబద్ధాలు చెప్పినందుకు ఎన్నికల సంఘం ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌ను ఖండించాలి.. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా హెచ్చరించాలని కోరింది.

Next Story