రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్ స్కామ్ ఆరోపణలు.. బీజేపీ బిగ్ కౌంటర్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 'అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం' ఆరోపణలపై బిజెపి నాయకుడు పియూష్ గోయల్ ఎదురుదాడికి దిగారు.
By అంజి Published on 7 Jun 2024 7:46 AM ISTరాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్ స్కామ్ ఆరోపణలు.. బీజేపీ బిగ్ కౌంటర్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 'అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం' ఆరోపణలపై బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గురువారం ఎదురుదాడికి దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నష్టాన్ని భరించలేక కాంగ్రెస్ ఎంపి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర మంత్రుల వ్యాఖ్యలు కౌంటింగ్‌కు ముందు స్టాక్ మార్కెట్‌లో పెరుగుదలకు దారితీశాయని, ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పకూలిందని , పెట్టుబడిదారులకు భారీ నష్టం వాటిల్లిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిని "అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం"గా పేర్కొంటూ గాంధీ విచారణకు పిలుపునిచ్చారు.
దీనిపై పీయూష్ గోయల్ స్పందిస్తూ.. 'లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఓటమిని రాహుల్ గాంధీ అధిగమించనట్లు కనిపిస్తోందని.. ఇప్పుడు మార్కెట్ ఇన్వెస్టర్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. నేడు భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తరువాత, విదేశీ పెట్టుబడిదారులు అధిక ధరలకు స్టాక్‌లను కొనుగోలు చేయగా, భారతీయ పెట్టుబడిదారులు విక్రయించి లాభాలను బుక్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ కుట్ర పన్నుతున్నారని గోయల్ ఆరోపించారు. "యుపిఎ ప్రభుత్వ హయాంలో రూ. 67 లక్షల కోర్ నుండి, భారతదేశ మార్కెట్ క్యాప్ రూ. 415 లక్షల కోట్లకు పెరిగింది. దేశీయ, రిటైల్ పెట్టుబడిదారులు ఎక్కువగా లాభపడ్డారు" అని ఆయన చెప్పారు.
బిజెపి ప్రభుత్వ హయాంలో స్టాక్ మార్కెట్ బలమైన వృద్ధిని సాధించిందని గోయాల్ అన్నారు. "గత 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో, మొదటిసారిగా మా మార్కెట్ క్యాప్ 5 ట్రిలియన్ డాలర్లను దాటింది. నేడు, భారతదేశ ఈక్విటీ మార్కెట్.. మార్కెట్ క్యాప్‌లోకి ప్రవేశించింది. ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో...మోడీ ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లో లిస్టయిన పీఎస్‌యూల మార్కెట్ క్యాప్ 4 రెట్లు పెరిగిందని మాకు తెలుసు'' అని అన్నారు.