క్ష‌మా బిందు పెళ్లికి ఆదిలోనే ఆటంకం

BJP won't Allow Kshama bindhu sologamy wedding in temple.త‌న‌ను తానే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించి గుజ‌రాత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2022 9:11 AM IST
క్ష‌మా బిందు పెళ్లికి ఆదిలోనే ఆటంకం

త‌న‌ను తానే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించి గుజ‌రాత్ అమ్మాయి క్ష‌మాబిందు దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కే దారి తీసింది. కొంద‌రు ఆమె నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తుండ‌గా.. ఎక్కువ మంది మాత్రం దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు. జూన్ 11న వడోదర గోత్రి ఆలయంలో త‌న‌ని తాను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతో పాటు ఇప్ప‌టికే ప‌త్రిక‌లు కూడా అచ్చువేయించింది. అయితే.. ఆమెకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది.

గోత్రి ఆల‌యంలో క్షమాబిందు పెళ్లికి ఆలయ యాజమాన్యం అనుమతి నిరాకరించింది. ఇది సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. అటు వ‌డోద‌రా మాజీ మేయ‌ర్ సునీతా శుక్లా క్షమాబిందు నిర్ణయాన్ని తప్పుబట్టారు. 'ఈ తరహా వివాహాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఆమె ఏ గుడిలో వివాహం చేసుకోవడానికి మేం అనుమతించం. ఇలాంటి వివాహాలు హిందూ మతానికి, భారత సంప్రదాయానికి విరుద్ధం. ఇలాంటి వాళ్ల చేష్టలతో హిందువుల జనాభా తగ్గే ప్రమాదం ఉంది. మతానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే.. ఏ చట్టమూ ఒప్పుకోదు' అని అన్నారు.

కాగా.. ఆలయ పాలకమండలి నిర్ణయంపై క్షమాబిందు స్పందించింది. ఆ గుడిలో తాను పెళ్లి చేసుకోబోవడంలేదని స్పష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆమె ఎక్క‌డ పెళ్లి చేసుకుంటుంది అన్న‌ది తెలియాల్సి ఉంది.

Next Story