కంగనా పొలిటికల్ ఎంట్రీపై బీజేపీ నుండి ఊహించని రెస్పాన్స్

BJP welcomes Kangana Ranaut. బాలీవుడ్‌‌‌‌ నటి కంగనా రనౌత్‌‌‌‌ బీజేపీ టికెట్‌‌‌‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

By Medi Samrat  Published on  30 Oct 2022 1:45 PM GMT
కంగనా పొలిటికల్ ఎంట్రీపై బీజేపీ నుండి ఊహించని రెస్పాన్స్

బాలీవుడ్‌‌‌‌ నటి కంగనా రనౌత్‌‌‌‌ బీజేపీ టికెట్‌‌‌‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. శనివారం హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీజేపీ టికెట్‌‌‌‌ ఇస్తే హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లోని మండి నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసే వారెవరైనా రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను కనుక సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్, మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, బీజేపీ కనుక కోరుకుంటే మండీ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంగన చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మోదీ పనితీరుతో ఇప్పుడు తమ కుటుంబం బీజేపీవైపు ఉందన్నారు.

కంగనా వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్ నుండి స్పందన వచ్చింది. కంగనా రనౌత్ ను పార్టీలోకి స్వాగతిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. పార్టీ టికెట్ ఇచ్చే విషయం ఇప్పుడే చెప్పలేమని ఆయన వివరించారు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకునే వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. పార్టీ టికెట్ ఇవ్వడం తన ఒక్కడి చేతిలో లేదని, అంతర్గతంగా చర్చించి ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయిస్తామని తెలిపారు. స్థానిక కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, వాటిపై చర్చించాకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, అక్కడ పార్టీ టికెట్ల కేటాయింపుపై ఇప్పుడే మాట్లాడలేమని నడ్డా చెప్పుకొచ్చారు.


Next Story