భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను న్యూ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి ఆధ్వర్యంలో చికిత్స పొందుతూ ఉన్నారు.
అద్వానీ వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రెండు నెలల క్రితం కూడా అద్వానీ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు.