జమ్మూ కాశ్మీర్‌లో సత్తా చాటిన బీజేపీ

జమ్మూకశ్మీర్‌లోని నాగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ఘన విజయం సాధించారు.

By -  Medi Samrat
Published on : 14 Nov 2025 9:18 PM IST

జమ్మూ కాశ్మీర్‌లో సత్తా చాటిన బీజేపీ

జమ్మూకశ్మీర్‌లోని నాగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ఘన విజయం సాధించారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో అధికార పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. 30 ఏళ్ల బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడంతో, ఆమె దివంగత తండ్రి, పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ సింగ్ రాణా వారసత్వాన్ని ఆమె ముందుకు తీసుకెళ్తుంది.

నవంబర్ 11న నాగ్రోటాలో పోలింగ్ జరిగింది. 75% కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేవయాని రాణా మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా కుమార్తె, ఆయన మరణంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. నాగ్రోటా తీర్పు వెల్లడైంది. ఈ విజయంపై దేవయాని రాణా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నాగ్రోటా ప్రజలు నన్ను ఒక కుటుంబ సభ్యురాలిగా భావించి ఆశీర్వదించారు. మా తండ్రి రాణా సాహిబ్‌పై చూపిన ప్రేమాభిమానాలనే నాపై కూడా చూపించారని ఆమె అన్నారు.

బీజేపీకి చెందిన దేవయాని రాణా 24,647 ఓట్లతో గెలిచారు, మొత్తం 42,350 ఓట్లు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్‌ 17,703 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన షమీమ్ బేగం 10,872 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.

Next Story