బీజేపీ ఎంపీ కొడుకుపై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ దుండ‌గులు

BJP MP Kaushal Kishore's son shot in chest. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ కౌశల్‌ కిశోర్‌ కుమార్ కొడుకుపై కాల్పుల‌

By Medi Samrat  Published on  3 March 2021 3:06 AM GMT
BJP MP Kaushal Kishores son shot in chest

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ కౌశల్‌ కిశోర్‌ కుమార్‌ కొడుకు ఆయూష్‌ (౩౦)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయూష్‌ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ల‌క్పోలోని మదీయవా ప్రాంతంలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియ‌ని దుండగులు ఆయూష్‌పై కాల్పులు జరిపారు. అనంత‌రం దుండగులు అక్క‌డినుండి పారిపోయారని పోలీసులు తెలిపారు.


కాల్పుల్లో గాయ‌ప‌డ్డ ఆయూష్‌ను వెంట‌నే హాస్పిటల్‌కు తరలించగా.. అత‌డు ప్రమాదం నుంచి బయటపడినట్లు ప్రకటించారు. ఆయూష్‌కు ఛాతిభాగంలో బుల్లెట్‌ గాయమైందని.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతన్ని ట్రామా సెంటర్‌లో చేర్పించినట్లు పోలీసులు చెప్పారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్‌ డీసీపీ రయీస్‌ అక్తర్‌ తెలిపారు. నిందితులు ఎందుకు కాల్పుల‌కు పాల్ప‌డ్డార‌నే కోణంలో విచారిస్తున్నారు. ఇదిలావుంటే.. కౌష‌ల్ కిషోర్.. మోహ‌న్ లాల్‌గంజ్ నియోజ‌క‌వ‌ర్గం నుండి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Next Story
Share it