అయోథ్యలో రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాలతో కొందరు బీజేపీ నేతలు మద్యం సేవిస్తున్నారని జబువా నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కాంతిలాల్ భూరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాలయం పేరుతో కొందరు కాషాయ నేతలు విరాళాలు సేకరిస్తూ వాటితో మద్యం కొనుగోలు చేస్తున్నారని మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ కాంగ్రెస్ నేత విమర్శించారు. పగలు రాముడి మందిరం పేరు చెప్పి విరాళాలు సేకరించి.. రాత్రి అవగానే విరాళాల్లో కొంత మద్యం సేవించేందుకు వాడుతున్నారని ఆరోపించారు.
ఇదిలావుంటే.. శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా రామమందిర నిర్మాణం కోసం స్వచ్ఛందంగా విరాళాలను సేకరించే బాధ్యతను ఆరెస్సెస్, వీహెచ్‌పీ వంటి సంస్థలకి అప్పగించింది. ఈ నేఫథ్యంలో ఆ సంస్థలు విరాళాల సేకరణ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.