సోషల్‌మీడియా ప్రభుత్వాలనే కూల్చేయగలదు.. త్వరలో చెక్ పెడతాం..
BJP Leader Ram Madhav Comments On Social Media. సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఘర్షణ నేపథ్యంలో బీజేపీ నేత రామ్‌మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on
21 Feb 2021 12:22 PM GMT

సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఘర్షణ నేపథ్యంలో బీజేపీ నేత రామ్‌మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొత్త పుస్తకం బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప‌్రభుత్వాలనే గద్దె దించే సత్తా సోషల్ మీడియాకు ఉన్నదని అన్నారు. సోషల్ మీడియా ప్రభావం చాలా ఉన్నదని.. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసి, అరచకానికి దారి తీసేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాను నియంత్రించడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవడం లేదని, అందుకే భారత ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో ఉన్నదని రామ్‌మాధవ్ వ్యాఖ్యానించారు. రాజకీయేతర, రాజ్యేతర శక్తులతో ప్రజాస్వామ్యం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. సోషల్ మీడియా ఎంత శక్తవంతమైనదంటే అది ప్రభుత్వాలనే కూల్చేయగలదు. వాటికి హద్దులంటూ ఏమీ లేకపోవడంతో నియంత్రించడం కష్టమవుతోంది. ఈ శక్తులు అరాచకానికి దారితీస్తాయి. మన రాజ్యాంగంలోనే పరిష్కారాలు ఉన్నాయి అని రామ్‌మాధవ్ అన్నారు.
Next Story