బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా ఠాకూర్‌కు కోవిడ్ పాజిటివ్
BJP leader Pragya Thakur tests Covid positive
By అంజి Published on 31 Jan 2022 5:17 AM GMTబీజేపీ నాయకురాలు, భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. "ఈరోజు నా కరోనా రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, నేను వైద్యుల సంరక్షణలో ఉన్నాను. గత 2 రోజులుగా నన్ను సంప్రదించిన వారందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మీ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.'' అని సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ట్వీట్ చేసింది. ఆవు మూత్రం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కరోనావైరస్ నుండి రక్షణ కల్పిస్తుందని గత సంవత్సరం ప్రగ్యా సింగ్ ఠాకూర్ చెప్పారు. "దేశీ ఆవు యొక్క మూత్రం మనల్ని ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచుతుంది. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను (ఆరోగ్య సమస్యలు) కానీ నేను ప్రతిరోజూ 'గౌమూత్ర ఆర్క్' (ఆవు మూత్రం) తీసుకుంటాను. కరోనావైరస్ కోసం మరే ఇతర ఔషధం తీసుకోనవసరం లేదు. నేను కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడలేదన్నారు. ఓ ఇంటర్వ్యూలో.. ఆవు మూత్రం తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను నయం చేయడంలో అతిపెద్ద ఆరోగ్య ప్రయోజనం ఉందని ప్రజ్ఞ్యా సింగ్ చెప్పింది. చెప్పింది.
మరోవైపు భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటలలో 2,09,918 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటలలో 2,62,628 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి 959 మంది మృతి చెందారు. ప్రస్తుతం 18,31,268 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 15.77% శాతంగా ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,03,96,227 మంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు.