సంభాల్‌లో ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి వాహనం ధ్వంసం

BJP candidate's car attacked in Sambhal. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో అస్మోలీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హరేంద్ర అలియాస్ రింకూ వాహనంపై దాడి జరిగింది.

By అంజి  Published on  14 Feb 2022 1:42 PM IST
సంభాల్‌లో ఉద్రిక్తత.. బీజేపీ అభ్యర్థి వాహనం ధ్వంసం

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో అస్మోలీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హరేంద్ర అలియాస్ రింకూ వాహనంపై దాడి జరిగింది. అతడి వాహనాన్ని నిరసన కారులు ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా బీజేపీ అభ్యర్థి, అతని మద్దతుదారులు పోలీస్ స్టేషన్‌లో తలదాచుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రింకూ కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.

ఉదయం 11 గంటల వరకు 23.03 పోలింగ్‌ శాతం నమోదైంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సహరాన్‌పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ, షాజహాన్‌పూర్‌లలో విస్తరించి ఉన్న స్థానాలతో ఈ దశలో 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2017లో మొత్తం 55 సీట్లలో బీజేపీ 38, సమాజ్‌వాదీ పార్టీ 15, కాంగ్రెస్‌ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి.

Next Story