అకస్మాత్తుగా మూడు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన బీజేపీ

2024 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు ప్రారంభించింది.

By Medi Samrat  Published on  25 Sep 2023 10:10 AM GMT
అకస్మాత్తుగా మూడు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన బీజేపీ

2024 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా మూడు రాష్ట్రాల అధ్య‌క్షుల‌ను మార్చారు. మూడు రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యాలయ ఇన్‌ఛార్జ్ అరుణ్ కుమార్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన‌ట్లు ప్ర‌క‌టించారు.

అరుణ్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మేఘాలయ బీజేపీ అధ్యక్షుడిగా రిక్మాన్ మోమిన్ నియమితులయ్యారు. పుదుచ్చేరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌ సెల్వగణాబతికి బాధ్యతలు అప్పగించారు. నాగాలాండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బెంజమిన్ యెప్తోమిని నియ‌మించారు. ఈ నియామకాలన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ నిఘా పెట్టడం గమనార్హం. అక్క‌డ ఎలాగైనా పాగా వేయాలని పార్టీ భావిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నియామకాలు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తుంది.



Next Story