రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ నుండి వాకౌట్ చేశాయి. అంతకుముందు పార్లమెంట్‌లో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన బిజూ జనతాదళ్ (BJD) బుధవారం నాడు ప్రతిపక్షాలతో కలిసి బయటకు వెళ్ళిపోయింది. ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు అంతరాయం కలిగించడాన్ని ఖండించింది YSR కాంగ్రెస్ పార్టీ (YSRCP). బీజేపీకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో YSRCP, BJD రెండూ జాతీయ స్థాయి కూటములకు దూరంగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు ఘోర ఓటమిని చవి చూశాయి. ఈ రెండు పార్టీలు తమ తమ రాష్ట్రాలలో కూడా అధికారాన్ని కోల్పోయాయి. బుధవారం, రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగం సమయంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. BJD నాయకుడు, రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర తన పార్టీ సహచరులతో కలిసి రాజ్యసభ నుండి వాకౌట్ చేయడంతో పాటూ ప్రతిపక్ష ఇండియా బ్లాక్ పార్టీ నేతలతో కలిసి నడిచారు.