బిర్యానీ అంటేనే మాకు ఇష్టమంటున్న భారతీయులు.!

Biryani ordered per second, on Swiggy in 2020. 2020వ సంవత్సరంలో నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం

By Medi Samrat  Published on  25 Dec 2020 6:34 AM GMT
బిర్యానీ అంటేనే మాకు ఇష్టమంటున్న భారతీయులు.!

2020వ సంవత్సరంలో నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన తర్వాత అతి భయంకరమైన కరోనా వైరస్ మన జీవితాళ్లోకి అడుగు పెట్టింది. అయితే కరోనా వైరస్ వ్యాపించడం వల్ల కొంత వరకు మంచే జరిగిందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ నేర్పించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్ రావడం వల్ల అన్ని సంస్థలు మూత పడటంతో ఉద్యోగులు ఇంటి నుంచి ప‌ని చేయడం మొదలుపెట్టారు. వర్క్ ఫ్రొం హోమ్, ఆన్లైన్ క్లాసెస్, నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేయడం వంటి ఎన్నో మార్పులు జరిగాయి. ఇన్ని మార్పులు జరిగినప్పటికీ కూడా.. "బిర్యాని" పై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదని ప్రముఖ ఫుడ్ సంస్థ స్విగ్గీ పేర్కొన్నారు.

తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వార్షిక గణాంకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో బిర్యాని మొదటి స్థానంలో ఉంది. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యాని ఆర్డర్ లు వచ్చేవని ఈ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో అత్యధికంగా ఆర్డర్ వచ్చిన వంటకాలలో బిర్యానీ రెండుసార్లు మొదటి స్థానంలో ఉండడం ఎంతో విశేషం. ఇందులో చికెన్ బిర్యాని అగ్రస్థానంలో నిలిచింది.

స్విగ్గీ యాప్ లో కొత్తగా చేరిన మూడు లక్షల మందికి పైగా యూజర్లు వారి తొలి ఆర్డర్ ను బిర్యాని పెట్టుకోవడం ఎంతో విశేషమని చెప్పవచ్చు. హైదరాబాద్, ముంబై, బెంగళూర్, ఢిల్లీ వంటి నగరాలలో ఎక్కువగా ఆర్డర్లు వచ్చేవని స్విగ్గీ పేర్కొంది. అంతేకాకుండా కరోనా సమయంలో స్ట్రీట్ ఫుడ్ ఎంతో మంది మిస్ అయ్యారని, అలాంటి వారికోసం పానీపూరి ని కూడా ఫుడ్ డెలివరీ యాప్ లో పెట్టడం వల్ల దాదాపు రెండు లక్షల పైగా పానీపూరి ఆర్డర్ లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ ఉండడంతో ఎక్కువగా కీటో డైట్‌ పదార్థాలకు ఆర్డర్లు వచ్చినట్లు ఈ సంస్థ పేర్కొంది.


Next Story