మణిపూర్‌లో ఊహించని పరిణామం..సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా

By Knakam Karthik  Published on  9 Feb 2025 6:44 PM IST
National News, Manipur, Bjp, Biren Singh, Resign,

మణిపూర్‌లో ఊహించని పరిణామం..సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా

మణిపూర్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపూర్‌లో జాతుల మధ్య వైరంతో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే అల్లర్ల విషయంలో బీరెన్ సింగ్ పని తీరుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. జాతి హింస ప్రారంభమైన దాదాపు 2 సంవత్సరాల తర్వాత మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. తాజాగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ పరిణామంతో మణిపూర్ పాలిటిక్స్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మలుపు తిరిగాయి.

Next Story