బికినీతో బస్సులోకి ఎక్కిన యువతి.. అంతా ఒక్కసారిగా షాక్

ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ బికినీ ధరించి వెళుతున్న వీడియో వైరల్‌గా మారింది.

By Medi Samrat  Published on  18 April 2024 8:45 AM GMT
బికినీతో బస్సులోకి ఎక్కిన యువతి.. అంతా ఒక్కసారిగా షాక్

ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ బికినీ ధరించి వెళుతున్న వీడియో వైరల్‌గా మారింది. క్లిప్ ఆమె తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు అయితే ఆమె దగ్గరకు కూడా వెళ్లకుండా వెనక్కు వచ్చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆమె వస్త్రాధారణ చూసి కొందరు షాక్ అయ్యామని చెబుతుండగా.. మరికొందరు “అశ్లీలత" గా అభివర్ణించారు. మరికొందరు ఆమె కోరుకున్నది ధరించడం.. ఆమె ఇష్టం అని వాదించారు.

వైరల్ క్లిప్‌లో, బికినీ ధరించిన మహిళ బస్సులోకి ప్రవేశించింది. వెంటనే, మరొక మహిళా ప్రయాణికురాలు ఆమె పక్కన నుండి బస్సులోని వేరే భాగానికి వెళుతుంది. వీడియో కొనసాగుతుండగా.. మరొక ప్రయాణికుడు తన సీటును వదిలి మహిళ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. 12 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరికొందరు ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేసి, మహిళపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వైరల్ అవుతున్న వీడియోపై అధికారులు ఇంకా స్పందించలేదు. ఈ వీడియో రికార్డ్ చేసిన ప్రాంతం, తేదీని న్యూస్ మీటర్ ధృవీకరించలేదు.

Next Story