బికనీర్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Bikaner, Earthquake, NCS, Rajasthan. రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో

By అంజి  Published on  22 Aug 2022 2:59 AM GMT
బికనీర్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో బికనీర్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని, భూకంప కేంద్రం బికనీర్‌కు 236 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నది. తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అంతకుముందు.. శనివారం తెల్లవారుజామున లక్నోలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిన సందర్భం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్‌ పితోరాగ్రాఫ్‌లో కూడా భూమి కంపించింది.


Next Story