బీహార్‌లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌డీఎ ప్రభుత్వ మంత్రి జీవేశ్ మిశ్రా గురువారం అసెంబ్లీ ఆవరణలో పోలీసు సూపరింటెండెంట్, జిల్లా మేజిస్ట్రేట్‌లు ప్రయాణిస్తున్న కార్లను అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి పోలీసుల దగ్గరికి వచ్చిన మంత్రి.. తన కారును ఆపేస్తారా అంటూ అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను నిలదీశారు. సంబంధిత అధికారులను సస్పెండ్ చేసే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని శపథం చేస్తూ మంత్రి జీవేష్ మిశ్రా అన్నారు.
ఓ వార్తా సంస్థ షేర్ చేసిన వీడియో క్లిప్‌లో మంత్రి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి "'హమ్ సర్కార్ హై, బట్టమీజీ కర్తే హో తుమ్ లాగ్' (మేము ప్రభుత్వం... ఇది అగౌరవం)" అని చెప్పడం చూడవచ్చు. డీఎం, ఎస్పీ కార్ల కోసం ఒక మంత్రిని అడ్డుకున్నారని మిశ్రా అన్నారు. "నన్ను వేచి ఉండేలా చేయడానికి SP, DM కార్లకు క్లియరెన్స్ ఇవ్వడానికి ఈ అధికారులు బాధ్యత వహిస్తారు. వారి సస్పెన్షన్ తర్వాతే నేను అసెంబ్లీలో ప్రవేశిస్తాను." అంటూ మంత్రి జీవేష్ మిశ్రా మాట్లాడారు.