పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే బీజేపీ మంత్రి ఉచిత సలహాలు

Bihar Minister Narayan Prasad Over Fuel Price Hike. దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే వెళుతున్న సంగతి తెలిసిందే..! వరుసగా

By Medi Samrat
Published on : 20 Feb 2021 12:41 PM

పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే బీజేపీ మంత్రి ఉచిత సలహాలు

దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే వెళుతున్న సంగతి తెలిసిందే..! వరుసగా 12 రోజులు చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో లీటర్ పెట్రోలుపై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ. 90 మార్కును దాటేసి రూ. 90.58కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 80.97గా ఉంది. హైదరాబాద్‌లో వీటి ధరలు వరుసగా రూ. 94.18, రూ.88.31గా ఉండగా, బెంగళూరులో 94.18, రూ. 88.31కి చేరుకున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ. 97.00గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.06గా ఉంది.

పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే.. బిహార్‌ బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలు పెరిగినా సామాన్యుల మీద పెద్దగా భారం పడదు.. ఎందుకంటే వారు ప్రజా రవాణా వ్యవస్థని ఎక్కువగా వాడతారు అంటూ నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు బిహార్‌ మినిస్టర్‌ నారాయణ్‌ పటేల్. సామాన్యులు ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థ మీద ఆధారపడతారు. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ప్రైవేట్‌ వాహనాలు వాడతారు. కాబట్టి ఇంధన ధరల పెంచినప్పటికి వారి మీద పెద్దగా ప్రభావం పడదు.. అంటూ వ్యాఖ్యలు చేశారు. పెరిగిన ధరలకు నెమ్మదిగా వారే అలవాటు పడతారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు తప్ప సామాన్యులు కార్లు వాడకపోవడం ఉత్తమం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నారాయణ్‌ పటేల్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.


Next Story