చనిపోయాడని భర్తకు అంత్యక్రియలు.. భార్యకు రెండో పెళ్లి.. 12 ఏళ్లకు ఆచూకీ లభ్యం

Bihar man writes to family from Pakistan jail after 12 years.బీహార్‌లోని బక్సర్ జిల్లాలో 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన 30 ఏళ్ల వ్యక్తి సజీవంగా ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి పాకిస్తాన్‌లోని జైలులో ఉన్నాడు.

By అంజి  Published on  18 Dec 2021 3:19 AM GMT
చనిపోయాడని భర్తకు అంత్యక్రియలు.. భార్యకు రెండో పెళ్లి.. 12 ఏళ్లకు ఆచూకీ లభ్యం

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన 30 ఏళ్ల వ్యక్తి సజీవంగా ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి పాకిస్తాన్‌లోని జైలులో ఉన్నాడు. ఖిలాఫత్‌పూర్‌కు చెందిన ఛవీ 18 ఏళ్ల వయసులో జాడ లేకుండా అదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిపించకుండా పోయిన సమయంలో ఛవీ మానసికంగా కుంగిపోయాడు. అతను తప్పిపోయిన తర్వాత.. అతని కోసం కుటుంబం ఎంతగానో వెతికింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఛవీ ఆచూకీపై ఎటువంటి ఆధారాలు లభించలేదు.

అతను దొరుకుతాడని కుటుంబసభ్యులు ఆశించినప్పటికీ వారి ప్రార్థనలు ఫలించలేదు. కొన్ని సంవత్సరాల తరువాత ఛవి ఇప్పటికీ రాకపోవడంతో అతని కుటుంబం తప్పిపోయిన వ్యక్తి యొక్క అంత్యక్రియలను నిర్వహించింది. ఛవీ ఇక తిరిగి రాడని అతని భార్య కూడా రెండో పెళ్లి చేసుకుంది. కాగా ఇప్పుడు పోలీసులు ఛవీ కుటుంబాన్ని సంప్రదించారు. భారతదేశంలోని ఖిలాఫత్‌పూర్ పౌరుడిగా చెప్పుకునే, పాకిస్తాన్‌లోని జైలులో ఉన్నట్లుగా చెప్పుకునే ఛవీ అనే వ్యక్తి నుండి తమకు లేఖ వచ్చిందని వారికి తెలియజేశారు.

ఛవీ ఇంకా బతికే ఉన్నందుకు ఆశ్చర్యపోయినప్పటికీ అమితమైన ఆనందంతో, అతని కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి తిరిగి రావడానికి ఎదురు చూస్తున్నారు. అతను బీహార్‌లోని తన ఇంటి నుండి అదృశ్యమైన తర్వాత అతను పాకిస్తాన్‌లో సరిహద్దు దాటి ఎలా వెళ్లాడో అని వారు చాలా గందరగోళంగా ఉన్నారు. ఈ లేఖ స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చిందని, పాకిస్థాన్‌లో ఛవీని ఎక్కడ ఉంచారో ఖచ్చితమైన ప్రదేశాన్ని పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. విదేశీ జైలు నుంచి భారతీయుడిని వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు వారు విచారణ జరిపి నివేదికను సమర్పించారు. అతను తప్పిపోయిన కొన్ని సంవత్సరాలకు ఛవీ తండ్రి మరణించాడు. అతని తల్లి, సోదరుడు ఛవీ యొక్క గుర్తింపును పోలీసులతో ధృవీకరించారని.. అతను సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారని చెప్పారు.

Next Story