నితీష్ తీరుపై తీవ్ర విమర్శలు

జాతీయ గీతాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అగౌరవ పరిచారు.

By Medi Samrat
Published on : 22 March 2025 7:15 PM IST

నితీష్ తీరుపై తీవ్ర విమర్శలు

జాతీయ గీతాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అగౌరవ పరిచారు. ఓ కార్యక్రమంలో అందరూ జాతీయం గీతాన్ని ఆలపిస్తుండగా ఆయన మాత్రం పక్కనే ఉన్న వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నవ్వుతూ, వారిని చేతులతో కొడుతూ జోకులు వేశారు. ఆసమయంలో పక్క వాళ్లు వద్దని చెబుతున్నా పట్టించుకోలేదు. ఆయన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. సీఎం నితీష్ కుమార్ తీరుపై మండిపడ్డారు. జాతీయ గీతాన్ని అగౌరవ పరచడంపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం నితీష్ కుమార్ ఆరోగ్య, మానసిక పరిస్థితిపై ఆర్జేడీ ఎంపీ మిశా భారతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజూ ముఖ్యమంత్రి మహిళలు, పిల్లలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నేత చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టడం సరికాదన్నారు.

Next Story