ప్రజలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు
వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 20 శాతం పెంచడంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోంది.
By అంజి Published on 15 Sept 2024 6:42 AM ISTప్రజలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు
వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 20 శాతం పెంచడంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోంది. అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్‌పై ఒక్కసారిగా రూ.15 - 20 పెరిగాయి. పామాయిల్ ధర రూ.100 నుంచి రూ.115. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.115 నుంచి రూ.130 - 140, వేరు శనగ నూనె రూ.155 నుంచి రూ.165కు చేరింది. పూజలకు ఉపయోగించే నూనెలనూ రూ.110 నుంచి రూ.120కి పెంచి వ్యాపారులు అమ్ముతున్నారు. నగరాలు, పట్టణాల్లోకి దుకాణాలు, ఆన్‌లైన్ విక్రయ సంస్థలు సైతం ధరలను పెంచి అమ్ముతున్నాయి. మరికొన్ని చోట్ల నూనె నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచింది. దీంతో సన్‌ఫ్లవర్, సోయా బీన్, రిఫైన్డ్ పామాయిల్‌పై ఇంపోర్ట్ టాక్స్ 12.5 శాతం నుంచి 32.5 శాతంకు చేరింది. దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇంపోర్ట్ టాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. మొత్తంగా ముడి నూనెలపై సుంకం 5.5 శాతం నుంచి 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై సుంకం 13.75 శాతం నుంచి 35.75 శాతానికి పెరిగింది.