డిసెంబర్‌ 8న భారత్ బంద్

Bharat Bandh On 8th December. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన

By Medi Samrat  Published on  4 Dec 2020 1:56 PM GMT
డిసెంబర్‌ 8న భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.. కానీ ఈ చర్చల్లో రైతుల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం లేదు. కేంద్రప్రభుత్వం తీరుకు నిరసనగా రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 8వ తేదీన దేశ వ్యాప్త బంద్‌ పాటించాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను మూసేస్తామని ప్రకటించారు.

దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుపై ఉన్న టోల్‌ గేట్లను ఆక్రమిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. టోల్‌ ట్యాక్స్‌ వసూలు చేయకుండా అడ్డుకుంటామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లఖోవాల్‌) ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లఖోవాల్ తెలిపారు. డిసెంబర్ 5న దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దహనం చేస్తామని అన్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఇలా సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల కోర్కెలను నెరవేరుస్తాయో లేదో చూడాలి.


Next Story