రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.

By Medi Samrat
Published on : 12 Dec 2023 4:46 PM IST

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో భజన్ లాల్ శర్మ పేరును ఆమోదించారు. భజన్ లాల్ శర్మ సంగనేర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంత‌కుముందు ఆయ‌న‌ రాజస్థాన్‌ బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

భజన్ లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జైపూర్‌లోని సంగనేర్ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. భజన్ లాల్ శర్మకు టికెట్ ఇచ్చేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ లౌహతి టికెట్‌ను బీజేపీ అధిష్టానం రద్దు చేసింది. భజన్ లాల్ శర్మ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజస్థాన్‌లో సీఎం అభ్య‌ర్ధిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. దానికి నేటితో ముగింపు ప‌లికింది అధిష్టానం.

Next Story