భయ్యా ఏం చేస్తున్నావ్‌..? ర్యాపిడో డ్రైవర్ ఎంత ప‌ని చేశాడంటే..

బెంగళూరుకు చెందిన ర్యాపిడో డ్రైవర్‌ చేసిన సిగ్గుమాలిన పని వెలుగులోకి వచ్చింది.

By -  Medi Samrat
Published on : 8 Nov 2025 5:40 PM IST

భయ్యా ఏం చేస్తున్నావ్‌..? ర్యాపిడో డ్రైవర్ ఎంత ప‌ని చేశాడంటే..

బెంగళూరుకు చెందిన ర్యాపిడో డ్రైవర్‌ చేసిన సిగ్గుమాలిన పని వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఒక అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన కష్టాలను వివరించింది. తాను రైడ్ బుక్ చేసుకుని వెళుతుండగా, బైక్ డ్రైవర్ దారిలో తన కాలు పట్టుకునేందుకు ప్రయత్నించాడని బాలిక చెప్పింది. ఈ సమయంలో త‌ను భయాందోళనకు గురై, మొత్తం ఘటనను కెమెరాలో రికార్డ్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. బాలిక రాపిడో బైక్‌పై చర్చి స్ట్రీట్ నుండి తన పిజికి తిరిగి వస్తున్నట్లు తెలిపింది. అప్పుడు రాపిడో డ్రైవర్ వేధింపులకు ప్రయత్నించాడు (తొడ‌ల‌ను తాకడం). దీనిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో రాపిడో యాజ‌మాన్యం స్పందించాల్సివుంది.

ఆ అమ్మాయి పోస్టులో.. ఒక్కసారిగా నాకు ఏం అర్థం కాలేదు.. భయ్యా, నువ్వేం చేస్తున్నావు, చేయవద్దు" అని చెప్పాను, కానీ అతను ఆగలేదు.. దీంతో రికార్డ్ చేసిన‌ట్లు చెప్పింది. “నేను దీన్ని షేర్ చేస్తున్నాను.. ఎందుకంటే ఏ స్త్రీ లేదా అమ్మాయి ఇలాంటివి భరించకూడదు. క్యాబ్‌లో గానీ, బైక్‌లో గానీ, మరెక్కడా కానీ.. నాకు ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.. కానీ ఈ రోజు నేను చాలా అభద్రతా భావంతో మౌనంగా ఉండలేకపోయానని పేర్కొంది.

నేను నా గమ్యస్థానానికి చేరుకోగానే.. ఒక వ్యక్తి చూసి ఏమి జరిగిందని అడిగాడు అని అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్పడంతో.. అతడు కెప్టెన్‌తో తలపడ్డాడు.. దీంతో కెప్టెన్ క్షమాపణలు చెప్పాడు.. అతను ఇకపై చేయనని చెప్పాడు - కానీ అతను వెళ్ళేటప్పుడు అతను నా వైపు వేలు చూపించాడు, అది నాకు మరింత సురక్షితం కాదని అనిపించింద‌ని ఆమ్మాయి పేర్కొంది.

Next Story