భగవంత్ మాన్‌కు షాకిచ్చిన లోక్‌సభ సెక్రటేరియట్
Bhagwant Mann To Be Evicted From MP Flat In Delhi By Lok Sabha Secretariat. ఆప్ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు పార్లమెంటు సభ్యునిగా
By Medi Samrat Published on 28 May 2022 8:00 PM ISTఆప్ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీలో కేటాయించిన కేంద్ర ప్రభుత్వ వసతిని అనధికారికంగా ఆక్రమించినందుకు ఆయనను అక్కడి నుండి తొలగించే చర్యలను ప్రారంభించాలని లోక్‌సభ సెక్రటేరియట్.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్‌లను కోరింది. పంజాబ్ ముఖ్యమంత్రి కావడం కోసం మాన్ మార్చిలో సంగ్రూర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 17వ లోక్‌సభ సభ్యునిగా మాన్‌కు సాధారణ వసతిగా కేంద్ర ప్రభుత్వం డ్యూప్లెక్స్ నంబర్ 33, నార్త్ అవెన్యూతో పాటు దాని యూనిట్లు, 153 నార్త్ అవెన్యూని కేటాయించినట్లు ఎస్టేట్ అధికారికి సమర్పించిన పిటిషన్‌లో సెక్రటేరియట్ పేర్కొంది.
ఏప్రిల్ 14 నుండి ఆయన పేరు మీద ఉన్న ఇల్లు రద్దు చేయబడిందని.. మాన్ ప్రాంగణాన్ని ఖాళీ చేయడంలో విఫలమయ్యారని లోక్‌సభ సెక్రటేరియట్ విభాగం పేర్కొంది. ఏప్రిల్ 13 తర్వాత ఆయన భవనాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవడం అనధికారమని లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది. భగవంత్ మాన్, మాజీ ఎంపీ కావడంతో తొలగింపు ప్రక్రియను ప్రారంభించవచ్చు.. తొలగింపుకు ఆదేశాలు జారీ చేయవచ్చని ఎస్టేట్ అధికారికి పిటీషన్ పంపారు. పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి తక్షణ స్పందన రాలేదని తెలుస్తోంది. అధికారిక పత్రాల ప్రకారం, RLP అధ్యక్షుడు, రాజస్థాన్ ఎంపీ అయిన హనుమాన్ బెనివాల్‌కు ఇప్పుడు ఆ ప్రాంతం మంజూరు చేయబడింది.
పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 424 మంది వీఐపీలకు తక్షణమే సెక్యూరిటీ కవర్‌ను రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ సెక్యూరిటీగా ఉన్న రక్షణ సిబ్బంది వెంటనే జలందర్ కంటోన్మెంట్‌లో ప్రత్యేక డీజీపీకి రిపోర్ట్ చేయాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ పోలీసు అధికారులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు సహా పలువురు సెక్యూరిటీ కవర్ ఈ ఆదేశాలతో రద్దు అయ్యాయి. నాలుగు దఫాలుగా సెక్యూరిటీ రద్దు నిర్ణయాన్ని పంజాబ్ ప్రభుత్వం అమలు చేసింది.