పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా 813 మంది ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసింది. లూథియానా రూరల్ లో 87, షాహీద్ భగత్‌సింగ్ నగర్ లో 48, గురుదాస్‌పూర్ లో 10, ఫరీద్‌కోట్ లో 84, పఠాన్‌కోట్ లో 199, హోషియాపూర్ లో 47, కపుర్తలాలో 6, ఎస్‌ఏఎస్ కస్బా లో 235, సంగర్ లో 16 లైసెన్స్‌లు రద్దయ్యాయి. వీటితో పాటు అమృత్‌సర్ కమిషనరేట్‌లో 27 మంది, జలంధర్ కమిషనరేట్‌తో పాటు పలు జిల్లాలకు చెందిన 11 మంది లైసెన్స్‌లు కూడా రద్దు చేయబడ్డాయి. ఇప్పటివరకు ప్రభుత్వం 2,000 పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసింది.
తుపాకులు వాడకంపై కొన్ని నియమాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాలకు ఆయుధాలను తీసుకెళ్లడం, ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు పేర్కొంది. శాంతిభద్రతలపై ప్రతిపక్షాల విమర్శలు.. అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లలో పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం గన్ కల్చర్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. పంజాబ్‌లో మొత్తం 3,73,053 ఆయుధాల లైసెన్స్‌లు ఉన్నాయని.. తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.