ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ
Panjab CM Bhagwant Mann Meets CM KCR. సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 20 Dec 2022 8:15 PM ISTసీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయ్యారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన అనంతరం దేశవ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్‌సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.
క్రిస్మస్ తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెలలోనే బీఆర్ఎస్ విధివిధానాలను ప్రకటించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. నెలాఖరు కల్లా 6 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతి నెల ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం నుంచే పనిచేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.