'మెట్రో నుంచి ఇంటి వరకూ నన్నే ఫాలో అయ్యాడు..' ఆఫీసు నుండి తిరిగి వస్తున్న అమ్మాయికి షాకింగ్ అనుభవం.!
బెంగళూరులో ఓ వ్యక్తి తనను వెంబడించడంతో ఓ బాలిక భయపడింది.
By Medi Samrat Published on 16 Jan 2025 2:36 PM ISTబెంగళూరులో ఓ వ్యక్తి తనను వెంబడించడంతో ఓ బాలిక భయపడింది. మెట్రోలో ఆమెను అనుసరించి.. ఆమె ఇంటికి వరకూ చేరుకున్నాడు. ఆ అమ్మాయి తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పంచుకుంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆఫీసు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నట్లు ఆ అమ్మాయి రాసింది.. 'నేను ఎప్పటిలాగే మెట్రోలో ప్రయాణించాను. నాకు తెలియని ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. అతను తన గురించి చెప్పడం ప్రారంభించాడు.
తాను ధరించిన జాకెట్‌పై కంపెనీ లోగో ముద్రించబడింది. దీంతో ఆ వ్యక్తి.. అమ్మాయిని ఆమె కంపెనీ గురించి, ఆమె ఎక్కడ పని చేస్తుందో అడగడం ప్రారంభించాడు. అంతకుముందే.. 'అతను తన ఉద్యోగం, నివాసం గురించి చెప్పాడు, కానీ నేను ఆసక్తి చూపలేదు' అని చెప్పింది.
దీని తర్వాత అతను నన్ను అనుసరించడం ప్రారంభించాడని అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఎక్కిన మెట్రో ఎక్కిన వ్యక్తి ఆ అమ్మాయి పక్కనే ఉన్న కోచ్‌లో కూర్చున్నాడు. బాలిక తన స్టేషన్‌లో దిగగానే.. ఆ వ్యక్తి కూడా అక్కడే దిగాడు.
నేను సాధారణంగా మెట్రో దిగి కాలినడకన ఇంటికి వెళ్లేదానిని. నాకు 10-15 నిమిషాలు పట్టేది. కానీ ఆ రోజు నేను చాలా అసురక్షితంగా భావించాను. దీంతో ఆటోలో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ వ్యక్తి ఆగలేదు. ఇంటి వరకు మరో ఆటోలో నన్ను అనుసరించాడు.
ఇదంతా చాలా డిస్టర్బ్‌గా ఉందని.. ఇప్పుడు తాను సురక్షితంగా లేవని భావిస్తున్నానని ఆ బాలిక తెలిపింది. బెంగుళూరులో తనకు ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారని, దీంతో తాను చాలా ఒత్తిడికి గురవుతున్నానని చెప్పింది. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికైనా ఎదురైందా అని ఆ అమ్మాయి ప్రశ్నించింది.
యువతి పెట్టిన ఈ పోస్ట్‌పై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కొందరు చెప్పారు. మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ.. మీరు జాగ్రత్తలు తీసుకోండి అని రాశారు.