ఐదేళ్ల క్రితం 'దీపావళి'.. ఆ సీఈఓకు మ‌ధుర జ్ఞాప‌కంగా మిగిలిపోయింది..!

Neend యాప్ వ్యవస్థాపకురాలు, సీఈవో సురభి జైన్ ఐదేళ్ల క్రితం బెంగళూరులో ఒంటరిగా నివసిస్తుండేది.

By Medi Samrat  Published on  30 Oct 2024 7:33 PM IST
ఐదేళ్ల క్రితం దీపావళి.. ఆ సీఈఓకు మ‌ధుర జ్ఞాప‌కంగా మిగిలిపోయింది..!

Neend యాప్ వ్యవస్థాపకురాలు, సీఈవో సురభి జైన్ ఐదేళ్ల క్రితం బెంగళూరులో ఒంటరిగా నివసిస్తుండేది. నగరం అంతా రంగురంగుల దీపాలతో వెలిగిపోవ‌డం.. అంద‌రి కుటుంబాలు క్రాకర్స్ వెలిగించి ఆనందించ‌డం జ‌రుగుతుంది. సురభి జైన్ మాత్రం దీపావ‌ళి పండుగను జరుపుకోవడానికి ఆమె కుటుంబం, స్నేహితులు ఎవ‌రూ అక్క‌డ‌ లేకపోవడంతో ఒంటరిగా ఉంది. పండుగ పూట ఒంట‌రిగా ఉన్న త‌న‌కు.. త‌న ఒంట‌రి త‌నం పోయేలా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఆమె ఎక్స్ వేదిక‌గా షేర్ చేసింది.

Xలో సురభి జైన్.. ఐదేళ్ల క్రితం నేను దీపావళికి బెంగుళూరులో ఉన్నాను. అది నిజంగా బాధాకరమైన ఓ ఒంటరి రోజు. నా స్నేహితులు, ఫ్లాట్‌మేట్స్, సహోద్యోగులందరూ ఇంటికి వెళ్లిపోయారు. ఆఫీసు ఇంటికొచ్చిన నేను ఆ సాయంత్రం ఫుడ్ ఆర్డర్ చేశాను. ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి ఆర్డర్‌ని తీసుకుని ఇంటి గుమ్మం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. అతడు త‌న‌ను చిరు నవ్వుతో పలకరించి 'దీపావళి శుభాకాంక్షలు' చెప్పాడు. ఇది నేను ఊహించ‌లేదు. ఒక పెద్ద సమాజంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న నాకు వ్యక్తిగతంగా ‘దీపావళి శుభాకాంక్షలు’ తెలిపిన ఏకైక వ్యక్తి. చిరునవ్వుతో ఆహారం తెచ్చి డెలివరీ చేసిన‌ వ్యక్తి పేరు రమేష్. చిన్న చిన్న మార్గాల్లో కూడా మన రోజులను ప్రకాశవంతం చేసే వారి పట్ల దయ చూపాలని గుర్తుంచుకోండని ఆమె ఎక్స్‌లో రాశారు.

ఆమె పోస్టు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. చాలా మంది X వినియోగదారులు ఆమె పోస్ట్‌కు కామెంట్లు చేశారు. పండుగ సీజన్లలో కుటుంబం, స్నేహితులు లేకుండా జీవించడం ఎంత కష్టమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story