బాంబు బెదిరింపు.. ఢిల్లీలో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ క్యూపీ 1335కి బెదిరింపు వచ్చింది

By Medi Samrat  Published on  16 Oct 2024 4:28 PM IST
బాంబు బెదిరింపు.. ఢిల్లీలో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ క్యూపీ 1335కి బెదిరింపు వచ్చింది. బెదిరింపులు రావడంతో విమానాన్ని తిరిగి ఢిల్లీలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగింది. విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్ర‌యాణికుల‌లో ముగ్గురు పిల్లలు ఉండ‌గా.. ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు.

దేశంలో ఏడు విమానాలకు ఈరోజు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా సైట్ ఎక్స్ ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి. అయితే ఈ బెదిరింపులు నకిలీవ‌ని తేలింది. విమానాల్లో బాంబులు అమర్చినట్లు ఎక్స్ హ్యాండిల్ లో పేర్కొన్నారు. అంతకుముందు సోమవారం కూడా మూడు అంతర్జాతీయ విమానాలను కూడా బెదిరించారు.

సోమవారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు అంతర్జాతీయ విమానాలకు ముంబై విమానాశ్రయంలో బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. అదే సమయంలో ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. బెదిరింపు రావడంతో ఎయిరిండియా విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు.

Next Story